MDK: మెదక్ పట్టణంలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావును చిలిపిచేడ్ మండలం రాందాస్గూడ గ్రామ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 27న జరగనున్న మహోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించాలని వినయపూర్వకంగా కోరారు.