WGL: 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 12 నుంచి 16కు, ఎంపీ స్థానాలు 2 నుంచి 3కు పెరిగే అవకాశముందని సమాచారం. ఈ మార్పులతో రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని స్థానాలు మహిళలకు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.