NDL: పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె గ్రామంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత సురేంద్రనాథ్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి ఉచిత సేవలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం రైతుల సమక్షంలో పాడి పశువులకు టీకాలు వేశారు.