ATP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గుత్తిలో టీబి యూనిట్ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ..ప్రజలందరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక వారం నుంచి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఉమ్ము పరీక్ష చేయించుకొవాలన్నారు.