చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన తిరుపతి (R), కురబలకోట పరిసరాలతో కొత్త నియోజకవర్గాలు, పలమనేరు-కుప్పం పరిధిలో వీకోట, వాయిల్పాడు, పూతలపట్టు-చిత్తూరు ప్రాంతాలతో కొత్త సెగ్మెంట్లు ఏర్పడే అవకాశం ఉంది. సోమల కేంద్రంగా పుంగనూరు సౌత్, శ్రీకాళహస్తి-సత్యవేడు మండలాలతో మరో నియోజకవర్గ ఛాన్స్ ఉంది.