పల్నాడు: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారులు చేరుకున్నారు. ప్రాంతాన్ని APFSL అసిస్టెంట్ డైరెక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు క్లూస్ టీమ్‌తో పాటు జాగిలం(సింబా)తో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు.