VKB: పరిగిలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రతి గల్లీలో స్వైర విహారం చేస్తూ ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లేవారిపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో అరుస్తూ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. నిన్న వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.