TG: తన నియోజకవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని MLA మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రీధరన్నా నా మీద పగపట్టొద్దు. మోరీలు లేవు, రోడ్లు లేవు.. నా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నేను ఎందుకు గెలిచానా అనిపిస్తోంది. నీకు దండం పెడతానన్నా.. నువ్వు ఒక్కసారి రావాలన్నా. నా మీద మీరు కుట్రలు పన్నుతున్నారు. స్పెషల్ కేటగిరీ కింద అభివృద్ధి చేయాలి’ అని కోరారు.