ఎస్బీఐ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ.3 కోట్ల కంటే ఎక్కువ) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన ధరలు.. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25% నుంచి 6.50% పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు 180 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10% నుంచి 6.35%, ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై 6.75% నుంచి 7% పెరిగింది.