విజయనగరం: జిల్లాలో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జే.సీ.ఎస్.సేధు మాధవన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా సోమవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధం అన్నారు.