విశాఖ: రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ ఛైర్మన్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు వనం రెడ్డి సతీష్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతంలో ఆయన చురుకుగా పని చేసి, అధినేత పవన్ కళ్యాణ్‌తో సమన్వయం కొనసాగిస్తున్నారు. దీంతో అతనికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.