W.G: ఆకివీడు పట్టణంలో నెలకొన్న వంటగ్యాస్ కొరత చిరు వ్యాపారులను రోడ్డున పడేసింది. గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్న వ్యాపారులు, తమ దుకాణాలను ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు పక్కనే మంటలు పెట్టి వంటలు చేస్తుండటంతో, ఆ పొగ కారణంగా వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు.