SRD: వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్యకు కారణమైన నిందితుడుకి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కృష్ణ అర్జున్ సోమవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి 2016లో వివాహమైన నాటి నుంచి భార్య శ్రీలతను కట్నం కోసం వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 2020లో సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసునమోదు చేయగా ఈకేసులో నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.