ASF: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆసిఫాబాద్ మండలంలోని సోనాపూర్కు చెందిన పంద్రం చంద్రు అనే రైతు నిలువునా మోసపోయాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన SBI లింక్ క్లిక్ చేయడంతో ఆయన ఖాతాలోని రూ. 61 వేలు మాయమయ్యాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ద్వారా మోసాన్ని గుర్తించిన బాధిత రైతు, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.