పెద్దపల్లి జిల్లాలో 2025-26 ఫైనాన్సియల్ ఇయర్ సంబంధించి ఉపాధి హామీ పథకంలో పెండింగ్ పనులు ఉంటే ఈనెల 25 వరకు పూర్తి చేయాలని అడిషనల్ పీడీ ప్రవీణ్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో, ఏపీవో ఉన్నారు.