ప్రకాశం: ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల పెంపుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఉండగా అవి కాస్త 18 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ స్థానాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.