హీరోయిన్ సమీరా రెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో పాతుకుపోయుంటాయి’ అని పేర్కొంది.