VZM: జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈనెల 28 నుంచి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచార శాఖ సహాయ సంచాలకులు పి. గోవిందరాజులు గురువారం తెలిపారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు.