ATP: అనంతపురం నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన రావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధిపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టరేట్లో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఓ.ఆనంద్, కమిషనర్ జశ్వంత్ రావుతో కీలక సమావేశం నిర్వహించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంకల ప్రొటెక్షన్ వాల్స్ పనులపై చర్చించారు.