కోనసీమ: జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. సందీప్, శశిధర్ నాగ్, సాయి సూర్య, యశ్వంత్, అవంతిలు ఈ పోటీలలో పాల్గొంటారని జిల్లా అధ్యక్షులు జవ్వాది తాత బాబు తెలిపారు. క్రీడాకారులు ప్రస్తుతం రాంచీ శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.