విజయనగరం: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గజపతినగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి అన్నారు. మంగళవారం గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. రైతులు లాభదాయకమైన పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.