విశాఖ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తూ, వారిపైనే దాడులకు తెగబడుతున్నారన్నారు.