ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమకు ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో ఒక ప్రధాన మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచస్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి నాంది పలుకుతున్న ఏపీకి అభినందనలు. ఇది అక్కడి యువతకు అవకాశాలను సృష్టించి, పారిశ్రామిక ఆవిష్కరణల్లో ఏపీని అగ్రగామిగా నిలబెడుతుంది’ అంటూ పోస్టు చేశారు.