SRCL: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లిలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల చక్రపాణి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసనకు వెళుతున్న తమ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు.