బాపట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో చదివే మూడో తరగతి విద్యార్థి అక్కి శ్రీరామ్ రిషిత్ యాదవ్ జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ చిత్రపటాన్ని గీసి బహుమతిగా అందజేశాడు. కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులతో కలిసి చిత్రపటాన్ని అందించారు. కలెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థిని అభినందించి ఆశీర్వదించారు.