KDP: ఉపాధి పనులు వేగవంతం చేయాలని కమలాపురం క్లస్టర్ అసిస్టెంట్ పథక సంచాలకుడు ఆజాద్ ఉపాది సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రతిరోజు 2,000 మంది కూలీలు పనిచేయాలి, వంద రోజులు పూర్తి చేసే కుటుంబాలు 1,000 వరకు ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సమీక్షలో ఉపాధి హామీ ఎపీవో రామాంజులరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.