SRD; అందోల్ మండలంలో 15వ విడత ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలరాజు, విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్, క్లస్టర్ ఎపీడీ మధులత ఉన్నారు.