ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)లో ఎస్పీ పీ. జగదీష్ 111 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కు వచ్చే పిటిషన్ల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.