KNR: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 233 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. కాగా, కొన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.