SRCL: రుద్రంగి మండలం, కథలాపూర్ మండలం కలిగోట సరిహద్దుల్లో పులి సంచరింస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పాదముద్రలను పరిశీలించి అవి హైనా పాద గుర్తులని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో పద్మారావు, సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ అలీ, బీట్ ఆఫీసర్ శ్రావణ్, సర్పంచ్ రమేశ్ ఉన్నారు.