»Assembly Elections 2023 Congress Leader Rahul Gandhi Says Party Will In All 5 States Mark My Words
Rahul Gandhi: ‘ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుంది’.. ఎన్నికల శంఖారావం పూరించిన రాహుల్
దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Rahul Gandhi: దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన మిజోరం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓటర్లను తన మాటలను గమనించాలని కోరారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్నారు.
బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కోసమే పని చేస్తుంది. రాజస్థాన్ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని కలిగి ఉంది. కర్ణాటక సాటిలేని సామాజిక భద్రతా వలయాన్ని అందిస్తుంది. అయితే ఛత్తీస్‌గఢ్ బలమైన విధానాలతో పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తుంది. మధ్యప్రదేశ్‌లోని అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించండి.. మా ఆరు హామీలు తెలంగాణలో అఖండ విజయాన్ని సాధించి పెడతాయి.’
Mark my words, the Congress party is going to win in Telangana, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, and Mizoram.
Congress party always works for the people. Rajasthan has the finest healthcare policy, Karnataka provides an incomparable social security net, while… pic.twitter.com/Nd2JfMUqNf
మిజోరామ్ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2,500 నెలవారీ వృద్ధాప్య పెన్షన్, రూ.750కి LPG సిలిండర్ ఇస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేఖంగా.. కాంగ్రెస్ కు భారతీయుల మద్దతు ఉందన్నారు. అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రం మండిపోతుంటే.. ఇక్కడో ఇజ్రాయెల్ గురించి మోడీ ఆవేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికే పని చేస్తోందన్నారు. అంతేకాకుండా మణిపూర్ ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, కుల ప్రాతిపదికన రెండు రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు.