భద్రాద్రి జిల్లాలో యాసంగిలో 23 మండలాల్లోని 963 గ్రామాలకు చెందిన 1,91,092 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమకానుంది. ఈ మేరకు జిల్లాకు రూ. 337.17 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2000 మందికిపైగా రైతులు కొత్తగా రైతు భరోసా కోసం నమోదు చేసుకున్నారు. ఇంకా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనున్నారు.