PDPL: ముత్తారం మండలంలోని మచ్చుపేట పరిధిలో గల బహుగుళ్ళ గుట్టపై మొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రాధిక-భాస్కర్ దంపతులు ఈ పూజను నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రూ. 2 కోట్లతో సీసీ రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో కొండపై అభివృద్ధి వేగవంతమైందని ఉపసర్పంచ్ రాకేశ్ తెలిపారు.