»Patancheru Brs Leader Neelam Madhu Resign To Brs Party
BRSకు గుడ్ బాయ్ చెప్పిన నీలం మధు..నెక్ట్స్ ఆ పార్టీయేనా
బీఆర్ఎస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పటాన్చెరువు కీలక నేత నీలంమధు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ గుర్తింపు ఇవ్వలేదని నీలంమధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మధు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
patancheru brs leader Neelam Madhu resign to BRS party
బీఆర్ఎస్(BRS) పటాన్చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం మరోమారు చేస్తారని తెలిసి కలత చెంది పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు పటాన్చెరు నేత నీలం మధు(Neelam Madhu) ముదిరాజ్ మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతేకాదు పటాన్చెరు(patancheru) నుంచి వచ్చెేఎన్నికల్లో పోటీ చేస్తానని ఏ పార్టీలో చేరతానో త్వరలోనే చెబుతానని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా తమ జాబితాలను ప్రకటించకపోవడంతో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ తనకు టికెట్ ఇస్తుందని మధు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నీలం మధు సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్(KCR) ముదిరాజ్ లకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం చిట్కుల్ సర్పంచిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పటాన్చెరువు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుపగా బీఆర్ఎస్ పార్టీ తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.