HYD: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో నిరుద్యోగుల మీట్ నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో SFI నేతలు, నిరుద్యోగులు, జేఏసీ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యల పై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.