NRML: కొత్త పోచంపాడ్ గ్రామానికి చెందిన (శ్రీనగర్) చింతల సంగీత–రవీందర్ దంపతుల కుమారుడు చింతల సంజయ్ ఇటీవల వెల్లడైన ఆల్ ఇండియా గేట్ (GATE) సివిల్ ఇంజనీరింగ్ ఫలితాల్లో 432 స్కోర్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీనగర్‌లోని ఆయన నివాసంలో రవీందర్ మిత్రులు సంజయ్‌ను శాలువాతో సత్కరించారు.