SRPT: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తోందని విమర్శించారు.