KRNL: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్దకడబూరు ఎస్సై మారుతి హెచ్చరించారు. ఆదివారం మండలంలోని కంబళదిన్నె గ్రామ శివారులో కోసిగి రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేకంగా తనిఖీలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.