NZB: ఆర్మూర్ పట్టణంలోని రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జిరాయత్ నగర్ విద్యా హైస్కూల్ ఆవరణలో ‘అవ్వకు బువ్వ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ నెలలో భాగంగా అతి నిరుపేద వృద్దులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి చేశారు. ఈసందర్బంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈకార్యక్రమం ద్వారా అతినిరుపేద వృద్దుల ఆకలి తీర్చడానికి కృషిచేస్తున్నామన్నారు.