MHBD: రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఆత్మ కమిటీ కమిటీ ఛైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. మన్నెగూడెం గ్రామంలోని రైతువేదికలో జరిగిన రైతులు, శాస్త్రవేత్తలు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత, మండల వ్యవసాయ శాఖ అధికారి ఛాయరాజ్ తదితరులు పాల్గొన్నారు.