SRD: ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో హన్మండ్లు అన్నారు. తడ్కల్ క్లస్టర్లో కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన 452 రైతులుండగా ఇప్పటివరకు 39 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 25వ తేదీలోగా మిగిలిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.