MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ మండల ఏపీవో రవీందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఈజీఎస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో అటవీ సమీప గ్రామాల శివారులో ట్రెంచ్, కందకాలను రెండు సంవత్సరాలుగా తవ్వడం జరుగుతుందన్నారు. ఆయా పనులు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదపడ్డాయన్నారు.