NRPT: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ధన్వాడ మండలంలోని మందిపల్లి చెరువు ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోకుండా నిండు నీటితో మెరిసిపోతోంది. సుమారు 123 ఎకరాల పంటలకు సాగునీరు అందిస్తూ రైతులకు కొంగుబంగారంగా మారింది. వానాకాలంలో అలుగు పారితే పంటలకు మేలు జరుగుతుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.