SRPT: పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కథల రాజేష్ కేసు విచారణపై చర్చించేందుకు నేడు కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశం వాయిదా పడింది. మందకృష్ణ మాదిగ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం 10 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.