NDL: శ్రీశైలం ఆలయంలోని స్వామివారి మూల విరాట్ వీడియో వైరల్ ఘటనను దేవస్థానం అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సుబ్బారెడ్డి తెలిపారు.