NZB: విద్యార్థులకు చదువులను దూరం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ శనివారం NZBలో బుక్ పట్టుకుని, చెవిలో పూలు పెట్టుకొని AISF ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు.