MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చాలా కాలంగా డిమాండ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రహదారితో పాటు పలు రోడ్లను విస్తరిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయన్నారు.