TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే శుక్రవారం రోజు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెడుతామన్నారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు.