ఐర్లాండ్(Ireland)లో బురదలో చిక్కుకున్న గొర్రెను ఓ మహిళ ప్రాణాలతో కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతుంది. ఈ భూమ్మీద నివసించే ప్రతి జంతువు, మనిషి ప్రాణం చాల విలువ అయినవి. మనిషి కానీ, జంతువు (Animal) కానీ ఆపదలో ఉందంటే కచ్చితంగా అక్కున చేర్చుకుంటాం. ఆదుకుంటాం. సాధ్యమైనంత వరకు వాటిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిస్తాం.ఐర్లాండ్‌లోని మౌర్నె పర్వతాల్లో లిన్ (Mourne Linn) అనే మహిళ అడ్వెంచర్‌కు వెళ్లింది. అయితే అక్కడున్న ఓ కాలువ వద్ద బురదలో ఓ గొర్రె పిల్ల చిక్కుకుపోయింది.
బురదలో నుంచి బయటపడేందుకు గొర్రె (Sheep) ప్రయత్నించడాన్ని ఆమె చూసింది. దీంతో ఆ మహిళ గొర్రెను ప్రాణాలతో కాపాడేందుకు తన బలం ఉపయోగించి ప్రయత్నించింది. గొర్రె కొమ్ములను పట్టుకుని బురదలో నుంచి బయటకు లాగింది. అనంతరం అక్కడే ఉన్న కాలువలోకి గొర్రెను లాక్కెళ్లి, బురదనంతా కడిగేసింది. ఆ తర్వాత ఒడ్డుకు చేర్చి, గొర్రెను దాని మందలోకి పంపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన ఇన్‌స్టా ఖాతాలో లిన్ షేర్ చేసింది.గొర్రెను ప్రాణాలతో కాపాడిన మహిళ (Woman)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.బురదలో చిక్కుకున్న గొర్రెను ఆమె ప్రాణాలతో కాపాడడాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మూగజీవాన్ని కాపాడినందుకు ఫిదా(Fida)అయిపోయారు. సూపర్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.