విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని DGCA విమానయాన సంస్థలను ఆదేశించింది. తాజాగా దీనిపై దేశీయ విమానయాన సంస్థలు స్పందించాయి. ఈ నిర్ణయం వల్ల టికెట్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖకు లేఖ రాశాయి.